దాదాపు 34 కోట్ల రూపాయల అప్పులున్నాయని పేర్కొన్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏడాది క్రితం వరకు ఇండస్ట్రీలో టాప్ హీరో, పాతిక కోట్ల రూపాయల రెమ్యూనరేషన్, ఎవరూ కనీసం ఊహించడానికి కూడా వీలు కానీ స్టార్ డమ్. ఇన్ని వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. నిన్న గాజువాకలో, ఇవాళ భీమవరంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కి ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు ఆయన అభిమానులను మాత్రమే కాదు.. సగటు పౌరులను కూడా గట్టి షాక్ ఇచ్చాయి.

pawan-kalyan-facing-problems

సేవింగ్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ కి ఏకంగా 34 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఈ విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క త్రివిక్రమ్ కే తాను రెండున్నర కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొనడం గమనార్హం. అలాగే తాను అడ్వాన్సుల రూపంలో తీసుకున్న మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ అప్పు అని చెప్పడం విశేషం. తమ అభిమాన కథానాయకుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలా 34 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయాడని తెలుసుకొన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు. మరి ఈ అప్పులను పవన్ కళ్యాణ్ ఎలా తీరుస్తాడో చూడాలి.

Share.