ఎన్టీఆర్, బాబీ సినిమాలో ఖరారైన మూడో హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన నటించే ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రాశీ ఖన్నా,  నివేత థామస్ నటిస్తున్నట్లు  చిత్రబృందం వెల్లడించింది. ఇక మూడో హీరోయిన్ గా నందితరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే నందిత, ఎన్టీఆర్ లపై కొన్ని సీన్లు షూట్ చేసినట్లు తెలిసింది. ‘ప్రేమకథా చిత్రం’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తర్వాత సినిమాలు ఫెయిల్ కావడంతో సినిమాలకు దూరంగా ఉంది.

ఇప్పుడు ఎన్టీఆర్ లో ఛాన్స్ రావడంతో ఆనందంలో ఉంది. జై లవ కుశ తన కెరీర్ ని మలుపుతిప్పుతుందని భావిస్తోంది. ఈ ముగ్గురితో పాటు హంసానందిని అందాలతో అలరించనుంది. బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ తదితరులు పనిచేస్తున్న జై లవ కుశ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.