జై లవ కుశ థియేట్రికల్ ట్రైలర్ | ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేత థామస్

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం ‘జై లవ కుశ’ .  యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే మార్కెట్ లో విశేషమైన ఆకర్షణ ఉన్న సంగతి తెలిసినదే. ఈ చిత్రానికి రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.  నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, “సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై “జై లవ కుశ” చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతోనిర్మించాం అన్నారు. కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.