జై లవ కుశ తొలి టీజర్ లో అదరగొడుతున్న ఎన్టీఆర్!

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ మూవీ టీజర్ మెస్మరైజ్ చేస్తోంది. ఎన్టీఆర్ తొలి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో జై కి సంభందించిన టీజర్ ని ముందే చెప్పినట్లుగా ఈ రోజు సాయంత్రం 5.22 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇందులో విలన్ పాత్ర దారి జై గెటప్ లో  ఉన్న ఎన్టీఆర్ చెప్పిన “ఆ  రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా..   ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా.. ఉందా” అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఎన్టీఆర్ నటనకు బలాన్ని ఇస్తోంది. చివరిలో జై నవ్వు విలనిజాన్ని కూడా ఎన్టీఆర్ అద్భుతంగా పండించగలరని చాటి చెబుతోంది. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.  బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి మరో రెండు టీజర్లు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.