ఆ బయోపిక్ నుండీ తప్పుకున్న శ్రద్ధా కపూర్?

ప్రస్తుతం బయోపిక్ ల జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఇది మరింత పెరిగింది. ఇప్పటికే ‘డర్టీ పిక్చర్’ ‘ధోని’ ‘సంజు’ వంటి చిత్రాలు విడుదలయ్యి భారీ విజయాల్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత గుంజన్ సక్సేనా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ లో సైనా పాత్ర కోసం మొదట శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారట. అయితే తాజాగా శ్రద్ధా కపూర్ ని .. సైనా నెహ్వాల్ బయోపిక్ నుండీ తప్పుకుందట…! ఈ వార్త అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

శ్రద్ధా కపూర్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా పుల్లెల గోపీచంద్ వద్ద నెల రోజుల పాటు బాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుందట. అంతేకాదు ఈ చిత్రం ప్రీలుక్ ని కూడా వదిలేసారు. అయితే ఇప్పుడు శ్రద్ధాకి డెంగ్యూ ఫీవర్ పాలయ్యింది కాబట్టి… ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పించినట్లు నిర్మాణ సంస్థ అయిన ‘టీ సిరీస్’ ప్రకటించింది. ఇప్పుడు శ్రద్దా కపూర్ స్థానంలో పరినీతి చోప్రాని తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి శ్రద్ధాకి డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా రోజులయ్యింది. కోలుకుని షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది. అలాంటిది ఎప్పుడో.. కారణం చెప్పి చిత్రబృందం ఆమెని తప్పించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రద్ధాని కావాలని తప్పించారని కొందరంటుంటే… లేదు తనకి ఇష్టం లేక తప్పుకుందని… బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Share.