‘సూర్యకాంతం’ కోసం ‘జనసేన’ ని వాడుకుంటుందా..?

మెగా డాటర్ నిహారిక నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం మర్చి 29 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ‘సూర్యకాంతం’ టీం తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాలకి పర్యటిస్తుంది నిహారిక. ఈ క్రమంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ప్రచారం చేస్తుందట. అదేంటి సినిమా ప్రమోషన్ కి వెళ్ళి నిహారిక ఇలా పవన్ పార్టీ ప్రచారం చేయడమేంటి అని అనుకుంటున్నారా…?

వివరాల్లోకి వెళితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా నిహారిక మాట్లాడుతున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్… పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారట. పవన్ గురించి ఏదో ఒకటి మాట్లాడితేనే కానీ అభిమానులు అరవడం ఆపరని అందరికీ తెలిసిన సంగతే. సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మొదలు పెట్టింది నిహారిక. ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ… ” బాబాయ్ జనసేన పార్టీ పెట్టి… జనం కోసం చాలా కష్టపడుతున్నారు. మీరంతా ఈ ఎన్నికలలో ఆయన్ని గెలిపించాలి.

నాకు ఇక్కడ ఓటు లేదు. నా బదులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెగా అభిమానులందరూ ఆయనకి ఓటేసి గెలిపించాలి. గెలిపిస్తారు కథా..?” అంటూ తన టీ గ్లాస్ పట్టుకున్న ఓ ఫోటోని ఎన్నికలు ముగిసే వరకూ పోస్ట్ చేస్తానని’ అభిమానులకి హామీ ఇస్తుంది నిహారిక. ఈ విధంగా తన సినిమా ప్రమోషన్లో కూడా పవన్ పార్టీని ప్రచారం చేస్తూ తన సినిమాకి మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది ఈ మెగా డాటర్. నిహారిక ఇలా జనసేన పార్టీ గురించి మాట్లాడటం పట్ల అటు మెగా అభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తలు ఎంతో వ్యక్తం చేస్తున్నారట.

Share.