రకుల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు : రాహుల్ రవీంద్రన్

కెరీర్లో ఒక్క హిట్టు లేని సుశాంత్ కు ‘చి ల సౌ’ లాంటి డీసెంట్ హిట్టిచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఈ చిత్రాన్ని ఆయన డీల్ చేసిన విధానం నిజంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. సుశాంత్ తోనే మంచి పెరఫార్మసి చేయించి శభాష్ అనుకున్నాడు ఈ దర్శకుడు. ఇక ఈ డైరెక్టర్ కు తిరుగులేదనుకున్నాడో ఏమో.. తన కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ అనిపించుకున్న ‘మన్మధుడు’ కే సీక్వెల్ చేసే అవకాశాన్ని కట్టబెట్టాడు నాగార్జున. ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

nagarjuna-fires-on-rakul-preet1అయితే రకుల్.. ఓ హిందీ చిత్రం కోసం బాగా సన్నబడిపోయింది. ఈ లుక్ నాగ్ కు నచ్చలేదంట. రకుల్ కాస్త ఒళ్ళు చేసే వరకూ తన సీన్లు పెండింగ్లో ఉంచమని నాగార్జున డైరెక్టర్ రాహుల్ చెప్పినట్టు గత కొంతకాలంగా వార్తలొచ్చాయి. ఈ వార్తలను రాహుల్ రవీంద్రన్ ఖండించాడు. ‘రకుల్‌తో ఎలాంటి ఇబ్బందులూ లేవని స్పష్టం చేశాడు. షూటింగ్ ప్రారంభమైన రోజు నుండీ రకుల్ యూనిట్‌తోనే ఉంది. ఆమె గొప్ప ట్యాలెంట్ ఉన్న నటి. సినిమా చాలా బాగా వస్తుంది’ అంటూ రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.

Share.