ప్రభాస్ పక్కన ఈ భామలు నటిస్తే ఎలా ఉంటుంది ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించాలని అందాల తారలు ఉత్సాహపడుతుంటారు. అయితే కొంతమందికే ఆ అవకాశం వరించింది. గత నాలుగేళ్లుగా డార్లింగ్ బాహుబలికి అంకితం కావడంతో ఎక్కువ సినిమాలు చేయలేక పోయారు. దీంతో ప్రభాస్ కో జోడీగా నటించాలనే హీరోయిన్ల సంఖ్య పెరిగిపోతోంది. బాహుబలి పార్ట్ 2 కంప్లీట్ కావడంతో తాను ఏడాదికి రెండు సినిమాలు తప్పకుండా చేస్తానని యంగ్ రెబల్ స్టార్ ప్రామిస్ చేశారు. ఆ చిత్రాల్లో ప్రభాస్ సరసన ఎవరెవరు నటిస్తే ఎలా ఉంటుందో.. ఓ ఇమేజినేషన్.

రకుల్ ప్రీత్ సింగ్Rakul preetటాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలోనే ప్రభాస్ కి జోడీగా నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది. బాహుబలి తో ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ ఇప్పుడు రకుల్ తో జోడీ కడితే ఆ సినిమా సూపర్ హిట్టే.

సమంత Samanthaక్యూట్ బ్యూటీ సమంత తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలతో నటించి హిట్ కొట్టింది. ప్రభాస్ పక్కన ఈమె కొంచెం హైట్ తక్కువయినప్పటికీ.. అమాయకమైన మొహం, అందమైన నవ్వుతో డార్లింగ్ కి సరైన జోడీగా నిరూపించుకుంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

శృతిహాసన్ Shruthi Hassanఐరన్ లెగ్ నుంచి లక్కీ గర్ల్ గా మారిపోయిన శృతిహాసన్ దక్షిణాది భాషల్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. నటన, డాన్స్ లు ఇరగదీసే ఆమె ప్రభాస్ పక్కన కనిపిస్తే ఆ ఫ్రేమ్ కే అందమొస్తుంది. ఈ పెయిర్ ని ఏ డైరక్టర్ జత కలుపుతారో చూడాలి.

కీర్తి సురేష్ Keerthi Sureshనేను శైలజ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ , నేను లోకల్ సినిమాతో స్టార్ హీరోలను సైతం తనవైపుకు తిప్పుకుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకి సైన్ చేసిన కేరళ కుట్టీ ప్రభాస్ కి లవర్ గా నటిస్తే చూడాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.

లావణ్య త్రిపాఠి Lavanya Tripatiకుటుంబ కథా చిత్రాలకు బాగా సూటయ్యే కథానాయిక లావణ్య త్రిపాఠి. ప్రభాస్ ఫ్యామిలీ డ్రామా జానర్ లో కథ ఒకే చేస్తే.. తప్పకుండా అందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఛాన్స్ కొట్టేస్తుంది. ఎందుకంటే వీరి జంట స్క్రీన్ పై ముచ్చటగా ఉంటుందని అందరికి తెలుసు.

రాశీ ఖన్నా Rashi Khannaచిన్న సినిమాలు నుంచి స్టార్ హీరోల సినిమాలోకి లాంగ్ జంప్ చేసిన ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ప్రభాస్ సరసన చక్కగా సూట్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రవితేజతో కలిసి నటిస్తున్న ఈ భామ వచ్చే ఏడాది డార్లింగ్ కి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టే ఛాన్స్ మెండుగా ఉంది. ఎందుకంటే వీరి జోడీకి ఎక్కువమంది ఓటేస్తున్నారు కాబట్టి.

పూజా హెగ్డే Pooja Hegdeప్రభాస్ హైట్ కి సరిపోయే మరో బ్యూటీ పూజా హెగ్డే. వీరిద్దరి జోడీ ఉరుము, మెరుపులాగా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం చిత్రంలో అల్లు అర్జున సరసన నటిస్తున్న ఈ సుందరి ఏ కథకి కనెక్ట్ అవుతుందో చూడాలి.

హెబ్బా పటేల్Hebha Patelహాట్ భామగా యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టిన హెబ్బా పటేల్ ప్రభాస్ కి మెయిన్ హీరోయిన్ గా సెట్ కాకపోయినప్పటికీ.. కాసేపు మరదిలిగా డార్లింగ్ పక్కన రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే థియేటర్ విజిల్స్ తో నిండిపోతుంది.

Share.