తారక్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను

జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తమిత్రుడవ్వడమే కాదు.. అతడితో జన్మదినాన్ని కూడా పంచుకొనే మంచు మనోజ్ కి తారక్ అంటే ఎంత అభిమానం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు ఆయన అంతిమ సంస్కార సమయంలో మనోజ్ తన సెలబ్రిటీ స్టేటస్ ని పక్కన పెట్టి.. ఒక సాధారణ స్నేహితుడిగా ఎన్టీఆర్ కి తోడుగా నిల్వడమే కాక అతడ్ని జనాలు ఇబ్బందిపెట్టకుండా కాపు కాసిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక మనోజ్ మీద రెస్పెక్ట్ పెరిగేలా చేసింది.

if-jr-ntr-enter-into-politics-i-will-support-him-manchu-manoj

అయితే.. నిన్న ఉదయం మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ కు రావాల్సిన రెండు కోట్ల రూపాయల ఫీజ్ రీయంబర్స్ మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడం లేదని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టినప్పుడు.. ఇదంతా వై.ఎస్.ఆర్.సి.పి వాళ్ళు చేయిస్తున్నారని గుసగుసలు వినిపించాయి. దాంతో మనోజ్ ని ఒక వ్యక్తి ట్విట్టర్ లో “మరి భవిష్యత్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తోడుగా ఉంటారా?” అని ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా. “తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, తారక్ రాజకీయాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నాను” అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మరోసారి మనోజ్ మంచితనానికి ఫిదా అయిపోయారు.

Share.