ఊర మాస్ లుక్ లో రామ్ సరికొత్త అవతారం..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ తాజాగా విడుదలయ్యింది. రామ్ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్లో రామ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. రామ్ ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడని టీజర్ చూస్తే స్పష్టమవుతుందని. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అంటూ టీజర్ చివరలో రామ్ చెప్పిన డైలాగ్ బాగుంది.

ismart-2

ismart-1

లుక్ అయితే కొత్తగా ఉంది కానీ… రామ్ ‘తెలంగాణ యాస’ చెప్పే తీరు అంత సెట్టవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది. టీజర్ చివర్లో రామ్ రుద్రాక్షలు వేసుకున్న లుక్ చూస్తుంటే.. ఎవరో విలన్ ని చూస్తున్నట్టు అనిపించక మానదు. రామ్ కాకుండా ఏ విజయ్ దేవరకొండో అయితే ఈ తెలంగాణ యాస కరెక్ట్ గా వచ్చేదేమో. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. టీజర్ అయితే పూరి స్టైల్ లో ఉంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఇక నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌ పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూన్ చివర్లో కానీ జులై లో కానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Share.