తనపై వచ్చిన రూమర్లను ఖండించిన నందిత

పెద్ద పెద్ద కళ్లతో “ప్రేమకథా చిత్రమ్” లో నందిత అందరినీ అదరగొట్టింది. నవ్వుని, భయాన్ని కలిగించి విజయం అందుకుంది. తేజ సినిమా “నీకు నాకు డాష్ డాష్” తో సినీ ఫిల్డ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ “ప్రేమకథా చిత్రమ్” తో మంచి ఫామ్లోకి వచ్చింది. మారుతీ దర్శకత్వంలో వచ్చిన మరో మూవీ లవర్స్ లోను సూపర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆమె నటించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంఖారాభరణం , సావిత్రి చిత్రాలు వరుసగా ఫెయిల్ కావడంతో హీరోయిన్స్ జాబితాలో అడుగుకు చేరింది. కొంతకాలంగా నందిత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. సినీ వేడుకల్లోనూ కనిపించలేదు.

దీంతో నందిత నటన జీవితానికి గుడ్ బై చెప్పిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై నందిత స్పందించింది. తాను నటించడంలేదనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. స్కిన్ షోకి దూరంగా మంచి పాత్రలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ అవకాశాలను అందుకుపోతున్న ఈ తరుణంలో మీడియా కంటికి కూడా కనబడనీయకుండా తిరుగుతున్న ఈ భామ ఎంతమేర రాణిస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.