భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న అలియా భట్..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ ను తీసుకున్నట్టు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తున్నట్టు స్పష్టమైంది. దాదాపు 350 నుండీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. రాంచరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఈ చిత్రం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ప్రతీ ఒక్కరు షాకవ్వాల్సిందే.!

‘రాజీ’ సినిమా సూపర్ హిట్ అవడంతో అలియా భట్ తన రెమ్యూనరేషన్ 10 కోట్లకి పెంచేసిందట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు కాబట్టి అలియాభట్ కి 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని చేస్తున్నట్టు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముధ్ర ఖని కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

Share.