పవన్ కళ్యాణ్ తిక్కకే కాదు సినిమా బిజినెస్ కీ లెక్క లేదు!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “అత్తారింటికి దారేది” తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ మరో మారు నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ కూడా ఇంకా నిర్ణయించకముందే సినిమా బిజినెస్ క్రేజ్ పీక్స్ కెళ్లిపోయింది. ఇప్పటివరకూ క్లోజింగ్ బిజినెస్ లు కూడా అవ్వని స్థాయిలో పవన్ కళ్యాణ్ 25వ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

ఓవర్సీస్ రైట్స్ 21 కోట్లు, నైజాం రైట్స్ 29 కోట్లు, తెలుగు-హిందీ శాటిలైట్ రైట్స్ కలిసి 30 కోట్లు. ఇలా మొత్తం కలిపి దాదాపు 80 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవ్వనున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు రిలీజ్ కి ముందే ఈ స్థాయిలో రచ్చ రచ్చ చేస్తుంటే.. రిలీజయ్యాక పవన్ కళ్యాణ్ సినిమా చేసే రచ్చకీ లేక్కుండదేమో. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.