మలయాళ సూపర్ స్టార్ హీరో తో రొమాన్స్ చేయనున్న కళ్యాణి

అఖిల్ సరసన “హలో” చిత్రంతో వెండితెర తెరంగేట్రం చేసిన క్యూట్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శినికి ఆ సినిమా ఆశించిన స్థాయి పెద్ద విజయాన్ని అందివ్వలేకపోయినా.. నటిగా మంచి గుర్తింపు మాత్రం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ గుర్తింపే ఆమెకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఆల్రెడీ మలయాళంలో ఒక సినిమా చేసిన ఈ అమ్మడు తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా, సాయిధరమ్ తేజ్ తో మరో సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ క్యూటీకి ఇప్పుడు ఇంకో ఆఫర్ వచ్చింది.

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన అవకాశం సొంతం చేసుకొంది కళ్యాణి ప్రియదర్శిని. డిసెంబర్ లో మొదలుకానున్న ఈ చిత్రానికి కార్తీక్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు. “వాన్” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ షూట్ డిసెంబర్ లో మొదలవ్వనుంది. చూస్తుంటే.. 2019లో మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో కళ్యాణి ప్రియదర్శిని కూడా జాయిన్ అవుతుందేమో.

Share.