నవ్వించే హాస్టల్ కష్టాలు!

పేరెంట్స్ తమ పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టల్లో చేర్పిస్తుంటారు. ఆ హాస్టల్స్ కొందరికి ఆనందాన్ని పంచితే మరికొందరికి బాధని కలిగిస్తాయి. పోను పోను ఆ బాధ అలవాటు అయిపోతుందనుకోండి. అయితే హాస్టల్లో కామన్ గా అందరూ ఎదుర్కొనే అంశాలతో ఈ వారం మన మహాతల్లి ఓ వీడియోని తీసుకొచ్చింది. “హాస్టల్ కష్టాలు” అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ వీడియో అందరికి కనెక్ట్ అవుతోంది. ఎక్కువ మార్కులు సాధించిన వారి ఫోజులు.. టిఫిన్ కోసం చేసే త్యాగాలు.. బాత్ రూమ్ దగ్గర గొడవలు.. ఇలా ప్రతి విషయం నవ్వుల్ని  పంచుతున్నాయి. జాహ్నవి, గౌతమితో పాటు మరికొంతమంది అమ్మాయిలు కలిసి చేసిన ఈ హంగామాను మీరు మిస్ కాకండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.