తేజు ‘చిత్రలహరి’ లేటెస్ట్ అప్డేట్..!

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సెకండ్ హ్యాండ్’ ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ చిత్రం తెరేకేక్కబోతుంది. సాధారణంగా కిశోర్ తిరుమల సినిమాలన్నీ యూత్ ఫుల్ మూవీస్ గానే ఉంటాయని అందరిలోనూ ఓ అంచనా ఉంది. అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఉండడబోతుందని డైరెక్టర్ కిషోర్ స్పష్టం చేశాడు.

విషయంలోకి వెళితే ఈ చిత్రంలో ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా నింపాడట కిశోర్ తిరుమల. ‘చిత్రలహరి’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తండ్రిగా పోసాని నటిస్తున్నాడట. ఇక తేజు, పోసాని లకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నాయట. ఒక వైపు హీరోయిన్లతో లవ్ ట్రాక్ ఎంత ప్లెజెంట్ గా సాగుతుందో… మరో పక్క తండ్రితో బాండింగ్ కూడా ఈక్వల్ గా ఉంటుందట. ఇక చిత్రం ప్రారంభం నుండీ ‘ఎండ్ కార్డ్’ పడే వరకూ తేజు-పోసాని ట్రాక్ హీరో-హీరోయిన్ల లవ్ స్టొరీకి సమాంతరంగా సాగుతుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా కల్యాణి ప్రియాదర్శన్, నివేద పెతురాజ్ నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ చిత్రానికి సంగీతమందించడం.. దేవి శ్రీ ప్రసాద్ కి ఇదే మొదటిసారి కావడం విశేషం.

Share.