వాళ్ళ తరుపున నేను సారీ చెబుతున్నాను: విజయ్ దేవరకొండ

తమ అభిమాన హీరో కోసం అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఆ అభిమానులను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. కానీ.. హీరోలు మాత్రం ఆ ఇబ్బందులు క్లియర్ చేయడానికి ముందుకు రారు. అయితే.. విజయ్ దేవరకొండ మాత్రం తాను రెగ్యులర్ స్టార్ హీరో కాదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ ట్రాఫిక్ పోలీసుల తనిఖీలో భాగంతో.. బుల్లెట్ బైక్ కి నెంబర్ ప్లేట్ లేకుండా “రౌడీ” అని స్టిక్కరింగ్ చేయించుకున్న ఓ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ను పట్టుకొని ఫైన్ వేశారు పోలీసులు.

vijay-devarakonda-says-sorry1

vijay-devarakonda-says-sorry2

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయమై వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ తన అభిమానుల తరపున పోలీసులకు క్షమాపణ చెప్పడమే కాకుండా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. చెప్పడమే కాక తన అభిమానులకు ఒక ఓపెన్ లెటర్ కూడా వ్రాశాడు.రెగ్యులర్ హీరోల్లా కాకుండా విజయ్ ఇలా ఇంటరాక్టివ్ గా ఉంటాడు కాబట్టే కుర్రాళ్ళందరూ విజయ్ అంటే ప్రాణం పెడుతుంటారు.

Share.