అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన విజయ్ దేవరకొండ..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా హాస్పిటల్లో ఎడ్మిట్ అవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది. ‘హోలీ’(నిన్న) సంబరాలు జరుపుకుంటూ హఠాత్తుగా ఫీవర్ కి గురయ్యాడట విజయ్. దీంతో వెంటనే ఓ లీడింగ్ హాస్పిటల్లో చేర్చారట. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని… గ్యాప్ లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తుండడం… దీంతో ఒత్తిడికి గురవ్వడం వలనే ఇలా నీరసం వచ్చిందని… ఓ రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు తెలిపారట.

అంతే కాదు సినిమాకు… సినిమాకు కొంత గ్యాప్ ఉంటే మంచిదని వారు చెప్పారట. ఒక పక్క ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చేస్తూనే.. మరో ప్రక్క క్రాంతి మాధవ్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రాన్ని కూడా చేస్తూ విజయ్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎండలలో షూటింగ్ చేయడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. విజయ్ ఇలా హాస్పిటల్ పాలయ్యాడన్న వార్త బయటకి వచ్చిందో లేదో అభిమానులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే వైద్యులు పర్వాలేదని చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారట. ఇక విజయ్ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కొంత విరామం తీసుకున్న వెంటనే క్రాంతి మాధవ్ తో చేసే సినిమా షూటింగ్లో విజయ్ జాయిన్ అవుతాడని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Share.