పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్..!

మెగా ఫ్యామిలిలో హీరోల పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు..! కెరీర్ ప్రారంభంలోనే శివ శంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవి గా పేరు మార్చుకుని టాలీవుడ్ కు మెగాస్టార్ అయ్యారు. ఇక కళ్యాణ్ బాబు కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. అయితే కొంచెం భిన్నంగా రాంచరణ్ తేజ్ లో తేజ్ ను తీసేసి రాంచరణ్ అయ్యి మెగాపవర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా చరణ్ బాటలోనే నడవబోతున్నాడట. అదేంటి సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకోవడమేంటి… అని అనుకుంటున్నారా..?

వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే వరుసగా మూడు హిట్లు అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అందులోనూ కాస్త చిరంజీవి పోలికలు ఉండడం మెగా అభిమానులని విపరీతంగా ఆకట్టున్నాయి. అయితే ఆ మూడు సినిమాలు పక్కన పెడితే ఇప్పటి వరకూ తేజూ మరో హిట్ సాధించలేకపోయాడు. దీంతో ‘దిల్ రాజు పుణ్యమా అని మొదటి మూడు సినిమాలూ హిట్టయ్యాయి.. తేజు కి అసలు కథలు సెలెక్ట్ చేసుకోవడం రాదు’ అనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అందుకే ఇప్పుడు తన పేరుని మార్చుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటి నుండీ సాయి ధరమ్ తేజ్ … ని కేవలం సాయి తేజ్ అనే పిలవాలట. తేజు నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’ చిత్రం టైటిల్స్ లో కూడా ఇదే పేరుని వేయాలని కోరాడట తేజూ. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర లిరికల్ సాంగ్ లో కూడా ‘ధరమ్’ ను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుండీ ఈ మెగా హీరో సాయి తేజ్ అని ఓ కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. ఒక హిట్టు కోసమే పేరులో మార్పులు చేస్తే బెటర్ అని శాస్త్రాల పరంగా ‘ధరమ్’ దరిద్రమని తెలుసుకొని.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Share.