ఆ దర్శకుడి పై నితిన్ కు అంత నమ్మకం ఎందుకో..?

ఒక హిట్టు డైరెక్టర్… ఒక హిట్టు హీరో… ఇలా ఓ కాంబినేషన్ సెట్ అయ్యిందంటే… అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రేక్షకులు ఫిక్సయిపోతుంటారు. అలా కాకుండా ఓ ఫ్లాపులో ఉన్న హీరో… ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో పనిచేస్తే… ఈ డైరెక్టర్ అయినా మన హీరో కి హిట్టిస్తాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటారు. అలా కాకుండా అసలే ప్లాప్ లో ఉన్న హీరో మరో ప్లాప్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తుంటే… ఆ సినిమా పై అంచనాలు ఏర్పడడం పక్కన పెడితే అసలు ఆ సినిమాకి బిజినెస్ జరగుతుందా అనేది కూడా పెద్ద సందేహమే. అందుకనే మన హీరోలు ఇప్పట్లో ఓ ప్లాప్ డైరెక్టర్ తో పనిచేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. కానీ మన నితిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు.

విషయంలోకి వెళితే గతంలో నితిన్ కి ‘గుండె జారి గల్లంతయ్యిందే’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొండా విజయ్ కుమార్. ఈ చిత్రం సక్సెస్ తో విజయ్ కు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ విజయ్ మాత్రం ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్లో ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని చేసాడు. నాగచైతన్య హీరోగా పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో ఆడలేదు. టేకింగ్ మొత్తం తన మొదటి చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లనే ఉందనే రిమార్క్ మాత్రం డైరక్టర్ విజయ్ పై పడింది. ఇదిలా ఉంటే తన ఇంట్లో గొడవల కారణంగా సినిమాలకి దూరమయ్యాడు ఈ డైరెక్టర్.ఇప్పుడు ఆ గొడవలు సర్దుకున్నాయట. దీంతో ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మళ్ళీ ప్రయతనాలు మొదలుపెట్టాడట. ఈ విషయం తెలుసుకున్న నితిన్… పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. తన కెరీర్లో త్రివిక్రమ్ మినహా పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ కాబట్టి నితిన్ ఇలా పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Share.