తన తదుపరి చిత్రాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చిన నితిన్

“శ్రీనివాస కళ్యాణం” డిజాస్టర్ అనంతరం సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ తదుపరి సినిమా ఏమిటనే విషయంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. “ఛలో” ఫేమ్ వెంకీ కుడుములతో ఒక సినిమా అని, చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా.. ఈ రెండు కాకుండా రమేష్ వర్మతో ఇంకో సినిమా అని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దాంతో అసలు నితిన్ నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ముఖ్యంగా ఏ ఒక్క సినిమా సెట్స్ కు వెళ్లకపోవడంతో నితిన్ తదుపరి సినిమా మీద ఆసక్తి నెలకొంది.

ఈ కన్ఫ్యూజన్ కి తెరదించుతూ.. తన తదుపరి సినిమా గురించి తానే ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు నితిన్. అలాగే.. రమేష్ వర్మతో సినిమా ఉందనే వదంతులను కొట్టిపడేశాడు. తన నెక్స్ట్ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉంటుందని, ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా ఉంటుందని.. ఇవి కాకుండా మరో సినిమా ఏమీ అంగీకరించలేదని, తన నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకూ ఎలాంటి న్యూస్ ను నమ్మొద్దని ట్వీట్ కూడా చేశాడు నితిన్.

Share.