‘హలో’ మూవీ టిజర్ | అఖిల్ అక్కినేని | కళ్యాణీ

త్వరలో ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్‌, తన రెండో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ ‘హలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కళ్యాణీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రానున్నది.  ప్యూర్ లవ్ స్టోరి తో కూడిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు జోడించి దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేయనున్నారు.

Share.