“హాట్ గా” హలో గురు ప్రేమ కోసమే టీజర్!

ఎనర్జటిక్ హీరో రామ్ అనేక ప్రేమ కథ చిత్రాల్లో నటించారు. దేవదాస్, నేను శైలజ వంటి హిట్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే ఈ సారి కూడా ప్రేమ కథనే ఎంచుకున్నారు. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి సినిమాలతో జోరు మీదున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయి మంచి అనుభూతిని పంచింది. 39 సెకన్ల ఈ వీడియోలో ఒకే ఒక్క సీన్ ని చూపించారు. ఈ సీన్ లో అనుపమని చూపించిన విధానం కుర్రకారుని ఆకట్టుకుంది. పైగా.. చూసావా?.. నీ కోసమే.. అంటూ అనుపమ చెప్పగా..  నడుమెమో అని సిగ్గుపడుతున్న రామ్.. కాఫీ అని చెప్పగానే హమ్మయ్య అనుకుంటాడు. అలాగే ఎలావుందీ?  అని అనుపమ అడగగా హాట్ గా ఉంది అని చెప్పి.. ఇండైరేక్ట్ గానే సమాధానం ఇస్తాడు.

ఈ సన్నివేశం చాలు.. సినిమాలో రొమాంటిక్ కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి.  ప్రకాష్ రాజ్ కీలకరోల్ పోషిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లోకి రానుంది. రామ్ గత చిత్రాలు హైపర్, ఉన్నదీ ఒకటే జిందగీ.. మంచి విజయాన్ని అందించలేకపోయాయి. ఈసారి హిట్ అందుకుంటారని ఈ టీజర్ చూసిన వారంతా చెబుతున్నారు.

Share.