వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న హెబ్బా పటేల్!

కుమారి 21 f సినిమాతో హెబ్బా పటేల్ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అవకాశాలు కూడా ఎన్నో వచ్చాయి అనుకోండి. కానీ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలవలేకపోయాయి. దీంతో వచ్చిన క్రేజీ ని క్యాష్ చేసుకోవడంలో విజయం సాధించకలేకపోయింది. ఇప్పుడు ఈ హాట్ భామ 24 కిసెస్ మూవీలో నటిస్తోంది. టైటిల్ ల్లోనే ముద్దులు ఉన్నాయి కాబట్టి సినిమాలో అవి మస్త్ గా ఉంటాయని అర్ధమవుతున్నాయి. మిణుగురు మూవీతో హిట్ కొట్టిన ఆయోధ్య కుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం పై హెబ్బా కెరీర్ ఆధారపడి ఉంది. ఇది హిట్ అయితే మరికొన్ని ప్రాజక్ట్స్ చేతికొస్తాయి.

లేదంటే సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. అందుకే ఈ భామ మంచి ప్లాన్ వేసింది. బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్లి హీట్ పుట్టించాలని భావిస్తోంది. షో నిర్వాహకులు కూడా తొలి సీజన్ కి వచ్చిన రేటింగ్ ఇప్పుడు  రావడం లేదని తెగ బాధపడుతున్నారు. తేజస్వి – సామ్రాట్, సునైనా – తనీష్ ల మధ్య రొమాన్స్ డోస్ పెంచినప్పటికే లాభం లేకపోవడంతో హెబ్బాని హౌస్ లోకి పంపించి స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. ఇరువైపులా ప్రయోజనం కావడంతో డీల్ సెట్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ” ఏదైనా జరగొచ్చు ” అని హోస్ట్ నాని పదే పదే చెబుతుండడం బట్టి ఇలాంటి ఎంట్రీలు తప్పకుండా ఉంటాయని సగటు ప్రేక్షుకుడు ఎదురుచూస్తున్నాడు.

Share.