భారీ హైప్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా తమిళ రీమేక్

తెలుగులో బోల్డెస్ట్ ఫిలిమ్ ఏది అంటే మరో ఆలోచన లేకుండా చెప్పే సినిమా పేరు “గుంటూర్ టాకీస్”. రష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాని తమిళంలో రీమేక్ చేశారు. ఆ సినిమా రేపు విడుదలవుతోంది. ఆల్మోస్ట్ అందరూ కొత్త ఆర్టిస్ట్స్ నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆల్రెడీ విశేషమైన క్రేజ్ ను క్రియేట్ చేసింది. తెలుగులో శ్రద్ధాకపూర్ ప్లే చేసిన సెక్స్ మేనియాక్ రోల్ ను సన్నీలియోన్ రిలేటివ్ మియా లియోన్ ప్లే చేస్తుండగా.. రష్మీ ప్లే చేసిన సెక్సీ విలేజ్ బెల్లీ రోల్లో అస్నా ఝవేరీ నటించింది.

ట్రైలర్ & ప్రోమోస్ చూస్తుంటే చిన్న చిన్న మార్పులు మినహా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేసినట్లు స్పష్టమవుతోంది. మరి అక్కడ కూడా “గుంటూరు టాకీస్” తెలుగులో హిట్టయిన రేంజ్ లో తమిళంలో హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. ఆ సినిమా పోస్టర్స్ & ప్రోమోస్ చేస్తున్న రచ్చ మాత్రం మామూలుగా లేదు. ఇకపోతే.. ఇటీవల తమిళంలోనూ బోల్డ్ కంటెంట్ ను అక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.

Share.