గుణ 369

“ఆర్ ఎక్స్ 100″తో అఖండ విజయం సొంతం చేసుకొన్నప్పటికీ.. “హిప్పీ” డిజాస్టర్ అవ్వడంతో ఆ సక్సెస్ క్రెడిట్ కార్తికేయకు దక్కలేదు. అందుకే.. ఈసారి ఊరమాస్ హీరోగా ప్రేక్షకుల్ని పలకరించాడు. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతు తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. మరి కార్తికేయ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..!!

guna-369-movie-review1

కథ: గుణ (కార్తికేయ) బీటెక్ పాసయితే చాలు లైఫ్ సెటిల్ అనుకొనే ఓ సాధారణ కుర్రాడు. చిన్ననాటి స్నేహితుడు భట్టు (రంగస్థలం మహేష్), కాలనీలోకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) మరియు తన కుటుంబం తప్ప వేరే ప్రపంచం తెలియని కుర్రాడు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుకోని విధంగా గద్దలగుంట రాధ (ఆదిత్య మీనన్) గుణ జీవితంలోకి వస్తాడు. ఒక హత్య కేసులో గుణ ఇరికించబడి.. జైలుకి పంపబడతాడు.

తాను చేయని నేరం నుంచి గుణ ఎలా బయటపడ్డాడు? అసలు అతడ్ని ఇరికించింది ఎవరు? అనేది తెలియాలంటే “గుణ 369” సినిమా చూడాలన్నమాట.

guna-369-movie-review2

నటీనటుల పనితీరు: మంచి కుర్రాడి పాత్రలో కార్తికేయ సరిపోయాడు. మనోడికి ఉన్న ఫాలోయింగ్ కి తగ్గట్లుగా రాసుకున్న సన్నివేశాలు, ఎలివేషన్స్ ఆకట్టుకొంటాయి. యాక్షన్ బ్లాక్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనేలా ఉన్నాయి. “హిప్పీ”తో దారుణమైన డిజాస్టర్ అందుకున్న కార్తికేయకు “గుణ 369″తో కాస్త ఊరట లభించింది.

మలయాళ కుట్టి అనఘ నటిగా సోసోగా పెర్ఫార్మ్ చేసినా.. ఆకర్షణీయమైన అందంతో అలరించింది. ఆదిత్య మీనన్ ప్రతినాయక పాత్రలో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నరేష్, రంగస్థలం మహేష్ తదితరులు ఆకట్టుకున్నారు.

guna-369-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: చైతన్య భరద్వాజ్ పాటలు, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వేల్యూస్ కి తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు అర్జున్ జంధ్యాల కథ కంటెడ్ కథనంపై ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసాడు. చాలా చిన్న కథలో ఎలివేషన్స్ & మాస్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువగా ఇరికించేశాడు. క్లైమాక్స్ లో ఇచ్చిన జస్టిఫికేషన్ & ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నప్పటికీ.. ఫస్టాఫ్ కథనంలో సాగతీత కాస్త ఎక్కువయింది. సినిమా మూల కథ “నా పేరు శివ” సినిమాను గుర్తుకు తెస్తుంది. అలాగే.. ఫస్టాఫ్ మొత్తం రొమాన్స్ & కామెడీ కాస్త అతిగా అనిపిస్తాయి. కథ మరీ పేలవమైనది కావడంతో క్లైమాక్స్ వచ్చేసరికి ఆసక్తికరమైన అంశాలు ఏమీ ఉండకపోయినా.. మాస్ ఆడియన్స్ ను అలరించే హెవీ యాక్షన్ బ్లాక్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి.

guna-369-movie-review4

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే పర్వాలేదనిపించే చిత్రం “గుణ 369”. మాస్ ఎలిమెంట్స్ & ఫైట్స్ లో హెవీనెస్ మరీ ఎక్కువవడంతో.. అందరూ ఎంజాయ్ చేయలేకపోయినా.. కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం బాగానే ఎంటర్ టైం అవుతారు.

guna-369-movie-review5

రేటింగ్: 2/5

Share.