గుమ్మడికాయ హల్వా ఫుల్ సాంగ్ | మెంటల్ మదిలో | శ్రీవిష్ణు | నివేతా

‘పెళ్ళిచూపులు’ తో సినిమా నిర్మాణంలో నిర్మాత రాజ్ కందుకూరి సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రంలో శ్రీవిష్ణు- నివేతా పేతురాజ్ జంటగా నటిస్తుండగా వివేక్ ఆత్రేయ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. హీరో నాని చేతులమీదుగా ఈ చిత్రంలోని ‘గుమ్మడికాయ హల్వా’ అనే పాట విడుదలయంది.

నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ…’మెంటల్ మదిలో’ టీజర్ చూశానని, చాలా నచ్చిందని ట్విట్ చేశారు. ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా తనకు బాగా నచ్చిందని, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ”ఈరోజు మెంటల్‌ మదిలో టీం ఒక వినూత్న విధానంలో హీరో అరవింద్‌ కృష్ణ పాత్రని పరిచయం చెశారు. జూలై చివరి వారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిషు-నివేతాల జంట చాలా బాగుంది” అని తెలిపారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.