మురళీశర్మ మెప్పించిన రోల్స్

ఏ పాత్ర పోషించినా అందులో లీనమై పొయ్యేలా నటించడంలో అలనాడు ఎస్వీ రంగారావుకు మంచి పేరుంది. ఆ తర్వాత అంతటి పేరు దక్కించుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఇతన్ని బీట్ చేస్తూ రావు రమేష్ వచ్చారు. ప్రస్తుతం రావు రమేష్ కి తన గంభీరమైన వాయిస్‌.. సహజసిద్ధమైన నటనతో పోటీ ఇస్తున్న నటుడు మురళీశర్మ. చేసే ప్రతి పాత్రలోనూ ఎంతో కొంత వైవిధ్యాన్ని చూపిస్తూ మంచి అవకాశాలను అందుకుంటున్నారు.

అతిథిMurali Sharmaగుంటూరోడైన మురళి శర్మ మొదట బాలీవుడ్ లో విజయాలను అందుకున్నారు. దాదాపు పదిహేను చిత్రాల్లో నట విశ్వరూపాన్ని చూపించిన శర్మ… మహేష్ బాబు అతిథి చిత్రంతో తెలుగులో అడుగు పెట్టారు. ఈ చిత్రంలో కైజర్‌, అజయ్‌ శాస్త్రిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఆ చిత్రంలో నటనకు ఉత్తమ విలన్ గా మురళీశర్మ నంది అవార్డు అందుకున్నారు.

భలే భలే మగాడివోయ్‌ Murali Sharma‘అతిథి’ తరువాత ఎన్టీఆర్‌ కంత్రి, ఊసరవెల్లి, ధోని, మిస్టర్‌ నూకయ్య, కృష్ణం వందే జగద్గురుమ్‌ తదితర చిత్రాల్లో నటించారు. అయితే భలేభలే మగాడివోయ్‌ తో అందరి అభిమాన నటుడు అయ్యారు. ఇందులో హీరోయిన్ తండ్రి పాండురంగారావుగా మెప్పించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

కృష్ణగాడి వీరప్రేమగాథMurali Sharmaనాని హీరోగా నటించిన మరో సినిమా కృష్ణగాడి వీరప్రేమగాథలో డేవిడ్‌ బాయ్‌గా సీరియస్ గా నటిస్తూ నవ్వులు పూయించారు.

నిన్నుకోరిMurali Sharmaనాని, శర్మ కాంబినేషన్ హిట్ అవుతుండడంతో నిన్నుకోరిలోను చంద్రమౌళి పాత్రను పోషించారు. కుమార్తె భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోనే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. పొదుపు చేసే విషయంలో కోట శ్రీనివాస్ రావు నటనకు గుర్తుకు తెచ్చారు. ఇలాంటి పాత్రలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

దువ్వాడ జగన్నాథమ్‌ Murali Sharmaఅల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాలో హీరోకి మార్గనిర్దేశం చేసే పోలీస్ ఆఫీసర్
పురుషోత్తమ్‌గా మురళీశర్మ అదరగొట్టారు. ఎలాంటి రోల్ అయినా సులువుగా చేయగలరనే నమ్మకాన్ని దర్శకులకు ఇచ్చారు.

అజ్ఞాతవాసిMurali Sharmaతాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ “అజ్ఞాతవాసి’లో శర్మగా నవ్వులు పూయించారు. ఈ పాత్ర చెప్పిన “వీడి చర్యలు ఊహాతీతం” అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

భాగమతిMurali Sharmaబాహుబలి తర్వాత అనుష్క చేసిన భాగమతిలోను మురళి శర్మ కీలకమైన పోలీస్‌ అధికారిగా ఆయన నటించారు. ఈ చిత్రం జనవరి 26న రిలీజ్ కానుంది. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చి పెడుతుందని సమాచారం.

సాహో
Murali Sharmaఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ప్రభాస్ సాహోలోను విభిన్నమైన పాత్రలో మురళీశర్మ కనిపించబోతున్నట్లు తెలిసింది. అతని కోసం సుజీత్ ప్రత్యేకంగా ఈ రోల్ సృష్టించినట్లు టాక్. మరి ఆ రోల్ ఎలా ఉండబోతుందో త్వరలో తెలియనుంది.

వరుసగా విజయాలను అందుకుంటూ భారీ చిత్రాల్లో నటిస్తున్న మురళీ శర్మకు ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియ జేస్తూ… మరిన్ని మంచి పాత్రలు పోషించాలని కోరుకుంటోంది.

Share.