గౌతమ్ నంద మూవీ థియేట్రికల్ ట్రైలర్ | గోపీచంద్ | హన్సిక | కేతరీన్

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గౌతమ్ నంద’. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుండగా.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. “జూలై 28న సినిమా విడుదలకు అన్నీ సిద్ధం. ఇప్పటికే టీజర్-సాంగ్ ప్రోమోస్ కి విశేషమైన స్పందన లభిస్తోంది. తమన్ ట్రెండీ మ్యూజిక్ అందించారు. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.