ఉత్తమ జాతీయ చిత్రంగా సెలక్ట్ అయిన ఘాజి.!

యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన ఘాజికి జాతీయ అవార్డు వరించింది. 65 వ జాతీయ అవార్డులు ఈరోజు ప్రకటించారు. 1971లో ఇండో-పాక్‌ వార్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ  చిత్రం ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డుకు ఎంపికైంది. నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయి తెలుగువారితో పాటు ఇతర భాషలవారిని మెప్పించింది. ఇందులో దగ్గుబాటి రానా అద్భుతంగా నటించి సినిమాని విజయతీరాలకు చేర్పించారు. గుణ్ణం గంగరాజు, ఆజాద్ ఆలం..

చరిత్రను వక్రీకరించకుండా సినిమాటిక్ రూపంలో కథను రాసారు. పీవీపీ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘాజికి కి అవార్డు లభించడంతో చిత్ర బృందం సంతోషపడుతోంది. త్వరలో చిత్ర బృందం మీడియా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకోనుంది. ప్రస్తుతం దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 65 వ జాతీయ అవార్డులు  పొందిన వారి పూర్తి వివరాలను కొన్ని గంటల్లో ఫిల్మీ ఫోకస్ మీకు అందించనుంది.

List of 65th-national-film-awards-for-2017_

Share.