మరో రికార్డ్ క్రియేట్ చేసిన ‘గీత గోవిందం’

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గీత గోవిందం. పరశురామ్ బుజ్జి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దాదాపు 120 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి విజయ్ దేవరకొండను స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ‘జిఏ 2’ పిక్చర్స్ సంస్ధ నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ మ్యూజిక్ అందించాడు. ‘ఇంకేం ఇంకేం కావాలే’ అనే ఒక్క పాటతో మొదటి నుండీ ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో లీక్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఒక సెన్సేషన్.

అయితే ఈ చిత్రాన్ని జీ తెలుగు చానల్లో మొదటి సారి ప్రసారం చేయగా మొదట 20.18 టీఆర్పీ నమోదు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రెండవసారి ప్రసారం చేసే సినిమాలకు మంచి టీఆర్పీ రావడం చాలా కష్టం. అయితే ఎవరూ ఊహించని విధంగా రెండవసారి ప్రసారం చేసినప్పుడు ‘గీతగోవిందం’ చిత్రం 17.16 టీఆర్పీని నమోదు చేసి మరో రికార్డు ను సొంతం చేసుకుంది. మొత్తానికి ‘గీతగోవిందం’ బుల్లితెర పై కూడా ఇంకా తన సత్తా చూపిస్తూనే ఉండడం విశేషం.

Share.