గౌతమి పుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయి నటసింహ జైత్రయాత్రకు తెరలేపింది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో చిత్రం ఎలా ఉంటుందో? అనే అభిమానుల అనుమానాలను ఈ వీడియో పటాపంచలు చేసింది. శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ రాయల్ లుక్ లో కనిపించి రికార్డులపై కత్తి దూశారు.

ఇందులో ఆయన చెప్పిన రెండు భారీ డైలాగులు చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పకనే చెబుతున్నాయి. చిరంతన్ భట్ సమకూర్చిన సంగీతం బాలకృష్ణ పోరాటానికి బలాన్ని ఇస్తోంది. బాలీవుడ్ నటి హేమ మాలిని అనుభవం, శ్రీయ శరణ్ అభినయం ఈ చిత్రానికి ప్లస్ కానుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.