గబ్బర్ సింగ్ పవర్ ఫుల్ డైలాగ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్, పంచ్ పవర్ ని నేటి యువతకి పరిచయం చేసిన సినిమా గబ్బర్ సింగ్. పదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. గబ్బర్ సింగ్ వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఈ సినిమా ఇచ్చిన కిక్ ఇంతవరకు తగ్గలేదు. ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ పవర్ ప్లేలో ప్రతీ బాల్ సిక్సు కొడితే ఎలా ఉంటుందో, అలా పవన్ తన ఆటిట్యూడ్, పంచ్ డైలాగ్స్ తో రెండున్నరగంటలు శివతాండవమాడాడు. ఆ పంచ్ డైలాగుల్లో టాప్ టెన్ మీకోసం..

01 . నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.Gabbar Singh

02 . తపస్సు చేస్తే ప్రత్యక్షమవడానికి నేను దేవుడ్ని కాదు కానీ, తప్పు చేసేవాడికి ఆటోమేటిక్ గా మన దర్శమైపొద్దిరోయ్.Gabbar Singh

03 . ఈగ వాలితే మీరు చూస్కోండి, ఇంకేమన్నా వాలితే నేనుచూస్కుంటా.Gabbar Singh

04 . అసలే పదిమందికి ఉపయోగపడాల్సినోడ్ని, పదికాలాలపాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించమ్మా.Gabbar Singh

05 . మానేయడం అంటే పారేయడం కాదురా పక్క నుంచి కొని మరి ఆపేయడం .Gabbar Singh

06 . నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేదు, ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ.Gabbar Singh

07 . బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ లో హెడ్ మాస్టర్ ఏంట్రా, అమ్మాయిరా, ఒరేయ్ ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, ఫైనల్ గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి పడుద్ది …అది సృష్టిధర్మంరా.Gabbar Singh

08 . భాగ్య లక్ష్మి ఫాన్సీ స్టోర్ కమ్, లేడీస్ ఎంపోరియం కమ్, హ్యాండీ క్రాఫ్ట్స్ కమ్, గిఫ్ట్ షాప్. ఇన్ని సార్లు కమ్ కమ్ అంటే రామా? వస్తాం!Gabbar Singh

09 . మా అమ్మకి నువ్వు ఓకే, మీ నాన్నకు ఓకే, నువ్వు ఊ అంటే కేకే.Gabbar Singh

10 . ఎరా.. నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీస్ లు బయపడతారంటగా, ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు. సరిగ్గా చూడు.Gabbar Singh

Share.