విజయ్ దేవరకొండ తో హిట్టు కొట్టడానికి వెయిట్ చేస్తున్న ప్లాప్ డైరెక్టర్లు

రోజు రోజుకీ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు డబుల్… ట్రిపుల్ అవుతుంది. ‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో ఘనవిజయాలు సాధించి ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగాడు ఈ రౌడీ. మధ్యలో వచ్చిన ‘నోటా’ చిత్రం ప్లాప్ అయినప్పటికీ ‘టాక్సీవాలా’ తో హిట్ ఇచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో బిజీ గా ఉన్నాడు విజయ్.

ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదే కాకుండా మరో నాలుగు ప్రాజెక్టులకు అడ్వాన్సులు కూడా తీసుకున్నాడంట. ప్రస్తుతానికైతే విజయ్ దేవరకొండ డేట్లు కాళీ లేవు. అయినప్పటికీ మారుతీ, పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ ముగ్గురు దర్శకులూ ప్లాపుల్లో ఉండటంతో విజయ్ తో ఒక్క సినిమా చేసి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share.