ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు బానే వర్కవుటైంది

‘సబర్ కా ఫల్ మీఠా హోతా హై’ అనే హిందీ సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఆ మీఠా ఫల్ అనగా తియ్యని పండుని ఆస్వాదిస్తుంది హీరోయిన్ వాణీకపూర్. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం “శుధ్ దేశీ రొమాన్స్”తో బాలీవుడ్ కు పరిచయమైన వాణీకపూర్ ఆ తర్వాత తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన “ఆహా కళ్యాణం”లో నాని సరసన కథానాయికగా నటించింది. మళ్ళీ కొన్నాళ్ళ విరామం అనంతరం యష్ రాజ్ స్టూడియోస్ నిర్మించిన “బేఫికరే”తో మళ్ళీ హీరోయిన్ గా హిట్ విఫలయత్నం చేసింది.

అయితే.. వాణీకపూర్ ను హీరోయిన్ గా సెటిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న యష్ రాజ్ సంస్థ ఇప్పుడు ఆమెకు మరో అవకాశం ఇచ్చింది. చిన్న హీరోలతో నటిస్తున్నంతకాలం వాణీకపూర్ హీరోయిన్ గా సెటిల్ అయ్యే అవకాశాలు లేవని గ్రహించిన యష్ రాజ్ సంస్థ ఆమెను ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే సదవకాశాన్ని అందించింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ సంస్థ నిర్మించనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో హృతిక్ శరాన వాణీకపూర్ కథానాయికగా నటించనుంది. మరి ఈ సూపర్ ఛాన్స్ తోనైనా వాణీకపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందా లేక ఎప్పట్లానే సినిమా టైమ్ లో హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయిపోతుందా అనేది వేచి చూడాల్సిందే.

Share.