తనకు అచ్చొచ్చిన ఫార్మాట్ ను నమ్ముకున్న అనుష్క

అరుంధతి, రుద్రమదేవీ, భాగమతి లాంటి చిత్రాలతో అందాల తార అనుష్క శెట్టి పేరును సుస్థిరం చేసిన చిత్రాలు. ఓ కథానాయకుడికి ఉన్నంత ఖ్యాతిని ఈ నాయికకు అందించిన సినిమాలు. ఈ ఘన విజయాలతో అనుష్క నాయిక ప్రధాన చిత్రాలకు చిరునామా అయ్యారు. ఆమె ఒక్కరు న్నా చాలు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం మొదలైంది. అనుష్క గత సినిమా భాగమతి కూడా ఇదే విషయాన్ని రుజువు చేసింది. భాగమతి తర్వాత ఏడాదిగా పరిశ్రమకు దూరంగా అనుష్క.. త్వరలో ఓ కొత్త చిత్రంలో నటించబోతోంది. మరో నాయిక ప్రధాన చిత్రానికే అనుష్క సన్నాహాలు చేసుకుంటోంది.

మాధవన్‌, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలు పోషించబోతున్నారు. కోన వెంకట్‌ కథను అందిస్తూ ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలు వహించ నుంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. అమెరికాలో వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. రచయిత కోన వెంకట్‌ ఈ చిత్ర వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గేందుకు వివిధ సంప్రదాయ ప్రక్రియలు, చికిత్సలు తీసుకుంటోంది. సైజ్‌ జీరో సినిమా చిత్రీకరణ సందర్భంగా అనుష్క తన పాత్ర కోసం ఇరవై కిలోల బరువు పెరిగింది.

Share.