మెహ్రీన్ నిర్ణయంపై అభిమానుల ప్రశ్న

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది. గోపీచంద్ తో కలిసి నటించిన పంతం రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. వరుస విజయాలతో టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న ఈ భామ సడన్ గా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. సింగిల్ హీరోయిన్ గా ఛాన్స్ లు ఉన్నప్పటికీ సెకండ్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ తో పాటు మెహ్రీన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్-2’ సినిమాలోనూ రెండో హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే విజయ్ దేవరకొండ “నోటా”లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరోయిన్ ఒకరే ఉన్నారు. అయితే కథ హీరో చుట్టూనే తిరుగుతుంది. మెహ్రీన్ తక్కువ సమయంలోనే కనిపిస్తుందని టాక్. ఇలా ఎందుకు ప్రాధాన్యత లేని రోల్స్ ని మెహ్రీన్ ఒప్పుకుంటోందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆమె నటించిన “కేరాఫ్ సూర్య”, “జవాన్” ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశాయని, అందుకే మెహ్రీన్ ఇలా తనను తాను తగ్గించుకుంటోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మంచి హిట్ పడితే సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Share.