పెళ్ళైన ప్రతి మగాడు ఎఫ్2 థియేటర్ల ముందు క్యూ కడతాడు!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల క్రేజీయస్ట్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రం టీజర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు. పేరుకు తగ్గట్లు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో నిండిన ఈ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా.. చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్న వెంకీ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో చెప్తున్న డైలాగ్స్ భలే గమ్మత్తుగా ఉన్నాయి.

f2-movie-teaser-review1

f2-movie-teaser-review2

ఇక సినిమా కాన్సెప్ట్ అయిన పెళ్లాలను కంట్రోల్ లో పెట్టడం అనేది మగజాతి ఆణిముత్యాలు భీభత్సంగా ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ కాబట్టి.. దిల్ రాజు ఆల్రెడీ ఒక హిట్ ను జేబులో పెట్టుకున్నట్లే. చూస్తుంటే.. అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’తో మరో హ్యాట్రిక్ హిట్ కు పునాది వేసినట్లే కనబడుతోంది.

Share.