అగ్ర నిర్మాత ఇచ్చిన భరోసాతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు!

“ఎవ్వరికీ చెప్పొద్దు” అనే సినిమా మార్చి 22న విడుదలవుతుందనే విషయం ఎంతమందికి తెలుసో కానీ.. ఆ సినిమా ట్రైలర్ & టీజర్ బాగుందనే విషయం మాత్రం అందరికీ తెలిసింది. ముఖ్యంగా.. ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని, సినిమాలోని ఫ్రెష్ కంటెంట్ ను గమనించిన ఓ అగ్ర నిర్మాత మరియు ఓ స్టార్ డిస్ట్రిబ్యూటర్ “ఎవ్వరికీ చెప్పొద్దు” చిత్రాన్ని ఈ శుక్రవారం బరిలోనుంచి తప్పించడమే కాక.. సినిమాకి మంచి థియేటర్లు కూడా ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే కథానాయకుడీగా తెరకెక్కిన ఈ చిత్రం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంది. దాంతో ఈ సినిమా అన్నీ చిన్న సినిమాల్లా తక్కువ థియేటర్లలో విడుదలై.. థియేటర్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత “అర్రే మంచి సినిమా ప్రేక్షకాదరణ నోచుకోకుండాపోయిందే” అని తర్వాత బాధపడేకంటే.. సినిమాని ముందు జనాల్లోకి తీసుకెళ్లి.. ఆ తర్వాత థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Share.