‘మహేష్ 26’ … రష్మిక కూడా చేయనని చెప్పేసిందట..!

అతి తక్కువ కాలంలో టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్ అయిపొయింది రష్మిక మందన. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ వంటి చిత్రాలతో గోల్డెన్ లెగ్ అనేలా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 31 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంతో పాటూ కన్నడంలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. ఇప్పుడు తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపొయింది.

ఇలా రష్మిక బిజీగా ఉండడంతో ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందట. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘మహేష్ 26’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా రష్మికను సంప్రదించారట. అయితే మొదట ఓకే చెప్పిన రష్మిక ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని తప్పుకుందట. ఏదేమైనా రష్మిక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే అని చెబుతున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share.