ఎందుకిలా? .. చూడాలనిపిస్తోంది!!

ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. నేటి బిజీ పీపుల్స్ ని అరచేతిలోనే వినోదాన్ని పంచడంలో వెబ్ సిరీస్ ముందు వరుసలో ఉన్నాయి. అందుకే సినిమాలో నటించే నటీనటులతో, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. దక్షిణాదిలో తొలిసారి అత్యధిక నాణ్యతతో కూడిన వీడియోలను అందిస్తున్న “YuppTV ”  డిజిటల్ కంటెంట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అటువంటి  “YuppTV ” వారు తెలుగు ప్రజలకోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  సుమంత్ అశ్విన్ (లవర్స్ ఫేమ్), యామిని భాస్కర్ (కాటమరాయుడు ఫేమ్) లు ప్రధాన పాత్రలుగా నిర్మించిన  వెబ్ సిరీస్ “ఎందుకిలా? ” ట్రైలర్ రిలీజ్ అయి నెట్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ ని చూడాలనే ఆత్రుతని ట్రైలర్ పెంచింది. ప్రస్థానం వంటి అవార్డు విన్నింగ్ చిత్రాన్ని తీసిన దేవ కట్టా పర్వవేక్షణలో లక్ష్మణ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ ఈనెల 19 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.