దువ్వాడ జగన్నాధం ఆడియో టీజర్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో బన్నీ సరసన ముకుంద ఫేమ్ పూజ హెగ్డే నటిస్తోంది. డీజే కోసం రాక్ స్టార్ దేవీ ప్రసాద్ అదిరిపోయే పాటలను అందించారు. సరైనోడు చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ఈ సారి గ్రాండ్ గా చేయాలనీ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ పై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.  జూన్ 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ తేదీలపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.