ఈ సమ్మర్ కి సమంత డబుల్ ట్రీట్… ఖాయం..?

పెళ్ళైన తరువాత కేవలం కథా బలం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ వస్తుంది… అక్కినేని వారి కోడలు సమంత. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘యూ టర్న్’ వంటి డీసెంట్ హిట్స్ తో మరింత క్రేజ్ పెంచుకుంటూ పోతుంది సామ్. ఇక నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత ఓ చిత్రంలో నటిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంత వృద్ధ వయసు ఉన్న పాత్రలో నటిస్తుందని… నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్టే చాలా మందికి తెలీదు… రేపో.. మాపో.. షూటింగ్ మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు… అయితే అప్పుడే షూటింగ్ పూర్తయిపోయిందట.

వివరాల్లోకి వెళితే… నందినీ రెడ్డి డైరెక్షన్లో ‘ఓ బేబీ’ అనే చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి ‘ఎంత సక్కగున్నావే’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో యువతిగానూ .. వృద్ధురాలిగాను సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతుందట. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు పూర్తయిందట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక సమంత… తన భర్తతో నటించిన ‘మజిలీ’ చిత్రం కూడా ఈ సమ్మర్లోనే విడుదల కాబోతుంది. మొత్తానికి ఈ సమ్మర్ కి రెండు చిత్రాలతో సమంత అలరించనుందన్న మాట..!

Share.