తెలంగాణలో టి.ఆర్.ఎస్ కు ప్రచారం చేస్తున్న దర్శకుడు!

తెలంగాణలో ఎన్నికల వేడి ఇంకా గట్టిగానే ఉన్నప్పటికీ ప్రచార పర్వం మాత్రం నిన్నటితో ముగిసింది. ఈ ప్రచార పర్వంలో బోలెడుమంది సినీ తారలు కూడా పాల్గొన్నారు. అయితే.. ముందు నుంచీ రాజకీయ పరమైన నేపధ్యం కలిగిన “పెళ్ళిచూపులు” దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ఏడాది ఎలెక్షన్స్ లో తన స్వస్థలమైన వరంగల్ లో తన అన్నయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. తరుణ్ భాస్కర్ రాజకీయ ప్రచారాలు అంటే మైకులు పట్టుకొని అరవడం కాకుండా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకొన్న విధానం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దర్శకుడిలో మంచి లీడర్ కూడా ఉన్నాడు అని తెలియజేసింది.

director-tharun-bhascker-campaigns-for-trs1

“ఈ నగరానికి ఏమైంది” తర్వాత రీసెంట్ గా వచ్చిన “బీటెక్” అనే వెబ్ సిరీస్ కి స్క్రిప్ట్ అందించిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ చేసుకొంటున్నాడు. తనకిష్టమైన సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే.. తన రాజకీయ నేపధ్యాన్ని తరుణ్ కొనసాగిస్తున్న తీరు అభినందనీయం.

Share.