స్పెషల్ ఫోకస్ అంతా పాయల్ పైనే : తేజ

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో తన గ్లామర్ తో పాటూ నటనతో కూడా ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రంలో ఈమె చేసిన గ్లామర్ షో కి కుర్ర కారు మతి పోయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం తరువాత వెంకటేష్ తో ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తుంది.దీనితో పాటూ రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పక్క ఈ చిత్రంలో నటిస్తూనే.. తేజ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో నర్తిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ చేస్తున్న ఈ సాంగ్ యువతను ఉర్రూతలూగించనుందని టాక్.

తాజాగా ఈ చిత్ర డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. ఈ ఇంటర్వ్యూలో పాయల్‌ పై ప్రశంసలు కురిపించాడు దర్శకుడు తేజ. పాయల్ పై తేజ మాట్లాడుతూ.. “టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న నటీమణుల్లో పాయల్ కూడా ఒకరు. ఈమె ఎప్పుడు రిహార్సల్స్‌కి రమ్మన్నా వస్తుంది, కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్లు చేస్తుంది. అంతేకాదు తను చాలా ప్రొఫెషనల్. ఈ పాటలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ ఉన్నప్పటికీ కూడా ఫోకస్‌ అంతా పాయల్‌ పైనే ఉంటుంది. పాయల్ అందంతో ఈ పాటకు మంచి గుర్తింపు వస్తుంది. 2019లో ‘బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్ ది ఇయర్‌’ గా ఈ పాట నిలిచిపోతుందని గట్టిగా చెప్పగలను” అంటూ తేజ చెప్పుకొచ్చాడు. తేజ ఈ రేంజ్లో పొగిడాడంటే.. ఎప్పటి ఎలా ఉండబోతుందనేది మనం అర్ధం చేసుకోవచ్చని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Share.