లాండ్రీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య

సినీ పరిశ్రమలో టాప్ హీరోల భార్యలు, డైరక్టర్ ల భార్యలు ఏదో కొత్త రకం బిజినెస్ లు స్టార్ట్ చేస్తూ అందరిని షాకింగ్ కి గురి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ఇక హీరోల భార్యల విషయానికి వస్తే, రామ్ చరణ్ భార్య ఉపాసన బిజినెస్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకోగా, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా చైల్డ్ ఫొటోగ్రఫీ సర్వీస్ ప్రారంభించి విజయం దిశగా వెళుతుంది. ఇలా కొంతమంది టాప్ హీరోల భార్యలు బిజినెస్ లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇక డైరెక్టర్స్ విషయానికి వస్తే, టాప్ డైరెక్టర్ రాజమౌళి భార్య రమా రాజమౌళి అయన ప్రతి సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, డైరెక్టర్ శ్రీనువైట్ల భార్య ఆర్గానిక్ మిల్క్ ప్రాడక్ట్ బిజినెస్ చేస్తుంది. ఇక ప్రస్తుతం ఇదే తరహాలో టాప్ డైరెక్టర్ సుకుమార్ భార్య ‘లాండ్రీ కార్ట్’ తో డ్రై క్లినింగ్ బిజినెస్ లోకి అడుగుపెడుతుంది. ఇది ప్రీమియం సూట్స్, కాస్లీ చీరల వాషింగ్ కి సంబంధించినదిగా తెలుస్తుంది. ఇక సుకుమార్ భార్య హైదరాబాద్ లో మూడు చోట్ల బ్రాంచ్ లను పెట్టడమే కాకుండా వాటిని ఆమె దగ్గరి నుండి చూసుకోనుంది. సుకుమార్ కి సినీ పరిశ్రమలో ఉన్న పేరు కారణంగా ఈ బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతుందనే ఆశలో సుకుమార్ భార్య ఉందని సమాచారం.

director-sukumars-wife-launches-her-own-venture1

Share.