నాగార్జున ఇప్పటికీ యూత్ కి ఇన్స్పిరేషనే..!

అక్కినేని హీరోల్లోనే కాదు టాలీవుడ్ అందగాడు అంటే టక్కున చెప్పే పేరు ‘కింగ్’ నాగార్జున. ‘ఆరు పదుల వయసు మీద పడుతున్నా.. ఇంకా ఈయన వయసు 30 ఏళ్ళ దగ్గరే ఆగిపోయిందా’.. అనే అనుమానం కలుగక మానదు. మొన్నటికి మొన్నొచ్చిన ‘దేవదాస్’ చిత్రంలో కూడా నాని కంటే నాగార్జునే ఎంతో యంగ్ గా కనిపించాడు అనే కామెంట్స్ వచ్చాయంటే… నాగ్ ఫిట్ నెస్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఏ హీరో అయినా నాగార్జున దగ్గరకు వస్తే ఆయన గ్లామర్,ఫిట్ నెస్ గురించే ఎక్కువ మాట్లాడుతుండం పలు సందర్భాల్లో చూసాం.

rahul-ravindran-posts-nagarjuna-look-in-manmadhudu-2-1

rahul-ravindran-posts-nagarjuna-look-in-manmadhudu-2-2ఇక తాజాగా నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘చి ల సౌ’ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య కీలక పత్రాలు పోషిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ చిత్రయూనిట్ ఫోర్చుగల్ వెళ్ళింది. అక్కడ షూటింగ్ లొకేషన్ దగ్గర జిమ్ములు లేవనుకుంటాను.. నాగార్జున చెట్టుకు వేలాడుతూ తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఇంత డెడికేషన్ తో ఇలా ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తున్నాడంటే.. నాగ్ ను అభినందించకుండా ఉండలేము. అలాగే యూత్ అందరూ నాగార్జున డెడికేషన్ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందంలో సందేహం లేదు. ఈ చిత్ర డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Share.