ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ..!

‘గ్రాఫిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్’ అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేరు కోడి రామకృష్ణ. అప్పట్లో గ్రాఫిక్స్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు ఈ దర్శకుడు. పాత చిత్రాల డైరెక్టర్ల పని అయిపొయింది అనుకునే సమయంలో కూడా.. ‘అరుంధతి’ లాంటి చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ అందున్న ఏకైక దర్శకుడు కోడి రామకృష్ణ అనడంలో అతిశయోక్తి కాదు. అటువంటి కోడి రామకృష్ణ ప్రస్తుతం అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏ.ఐ.జి హాస్పిటల్ లో చేరారట.

ఇప్పుడు ఆయనకు వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా పక్షవాతం బారిన పడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారట. అయితే ఈసారి మాత్రం తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారట. ఇప్పటికే ఈ వార్త విన్న సినీ ప్రముఖులు కొందరు హాస్పిటల్ కి చేరుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ లో ఆందోళన మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవితో 1982లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని అందించారు. ‘అమ్మోరు’ ‘దేవి’ ‘అరుందతి’ వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాయి.

Share.