నాని పై ‘జెర్సీ’ డైరెక్టర్ సంచలన కామెంట్లు..!

ఏప్రిల్ 19 న(నిన్న) విడుదలైన ‘జెర్సీ’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. గత సంవత్సరం విడుదలైన ‘మహానటి’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో… ఆ రేంజ్లోనే ఈ చిత్రానికి కూడా రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంతో నాని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడని.. అర్జున్ పాత్రలో నాని జీవించేసాడని ఎన్టీఆర్,బన్నీ వంటి స్టార్ హీరోలు సైతం కామెంట్లు పెడుతుండడం విశేషం. ఇదో క్లాసిక్.. ఓ మాస్టర్ పీస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ చిత్రం పై నాని మొదటి నుండీ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలిపాడు. ఫైనల్ గా తన నమ్మకం నిజమైందనే చెప్పొచ్చు.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. నాని పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. నాని తో పని చేయడం ఎలా అనిపించింది ? అనే ప్రశ్నకి గౌతమ్ సమాధానమిస్తూ.. “ఈ కథని నాకంటే నాని నే ఎక్కువగా నమ్మాడు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి నాకు చాలా భయమేసింది. తన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనా…అని..! ‘జెర్సీ’ కోసం ఎంత చేయాలో అంతా చేసాడు నాని. అర్జున్ పాత్రను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.