మహేష్ 25 సినిమాలో అనేక మార్పులు!

దిల్ రాజు ఈ ఏడాది ప్రథమార్ధం లోనే హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాధం సినిమాతో సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరు నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫిదా (వరుణ్ తేజ్), రాజా ది గ్రేట్ (రవి తేజ ), ఎంసిఎ (నాని) సినిమాలు రిలీజ్ చేయడానికి అంత సిద్ధం చేశారు. ఈ విజయాలు దిల్ రాజు లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది మహేష్ 25 మూవీ షూటింగ్ మొదలుకాబోతోంది. దీనిని అశ్వినీ దత్ తో కలిసి దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. వంశీ పైడి పల్లి కూడా షెడ్యూల్ ఖరారు చేశారు.

అయితే వంశీ పైడి పెళ్లిని, అతని కథని పక్కన పెట్టి.. కొత్త కథతో మహేష్ తో 25  వ మూవీ చేయడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న ని డైరక్టర్ గా ఫిక్స్ చేశారని, అశ్విని దత్ తో కలవకుండా ఒంటరిగానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలిసింది. ఈ కుటుంబ కథ చిత్రానికి శ్రీనివాస్ కళ్యాణం అనే అటైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.